కాంగ్రెస్‌ నేతలు టివి చర్చలకు వెళ్లకండి

Randeep Singh Surjewala
Randeep Singh Surjewala

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ పార్టీకి చెందిన ప్రతినిధులు, మీడియా ప్యానలిస్టులను టివి చర్చలకు వెళ్లవద్దు అంటే ఆదేశించింది. ఒక నెల పాటు టివి చర్చలకు దూరంగా ఉండాలని ప్రకటించింది. దీనికి సంబంధించి కాంగ్రెస్‌ పార్టీ కమ్యూనికేషన్‌ చీఫ్‌ రణ్‌దీప్‌ సుర్జేవాలా ఓ ట్వీట్‌ చేశారు. కాంగ్రెస్‌నేతలను షోలకు ఆహ్వానించరాదు అని టివి ఎడిటర్లకు కాంగ్రెస్‌ విజ్ఞప్తి చేసింది. ఎందుకు ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నారనే దానిపై వివరణ ఇవ్వలేదు. తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాల దృష్టా కాంగ్రెస్‌ తీవ్ర అసహనానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/