ఐదోసారి గోల్డెన్‌ డక్‌…

MS DHONI
MS DHONI


నాగ్‌పూర్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో ఎంఎస్‌ ధోని డకౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. కేదార్‌ జాదవ్‌ (11) ఐదో వికెట్‌గా పెవిలియన్‌ చేరిన తర్వాత క్రేజ్‌లోకి వచ్చిన ధోని…తాను ఆడిన తొలి బంతికే ఔట్‌ అయ్యాడు. ఆడమ్‌ జంపా వేసిన 33వ ఓవర్‌ మూడో బంతిని కవర్స్‌ మీదుగా షాట్‌ ఆడాడు. అయితే అక్కడ ఫీల్డింగ్‌ చేస్తున్న ఖవాజా క్యాచ్‌ పట్టడంతో ధోని ఇలా వచ్చి అలా పెవిలియన్‌ చేరాడు. తన వన్డే కెరీర్‌లో ఇలా గోల్డెన్‌డక్‌గా ఔట్‌ కావడం ఐదోసారి. అంతకుముందు బంగ్లాదేశ్‌ (2004 అరంగేట్రం మ్యాచ్‌), శ్రీలంక (2005), శ్రీలంక (2007), ఆస్ట్రేలియా (2010)జట్లపై ధోని గోల్డెన్‌ డక్‌గా నిష్క్రమించాడు. ఈ మ్యాచ్‌లో ధోని ఆరోవికెట్‌గా ఔటయ్యాడు.