భవిష్యత్‌ తరాల కోసమే హరితహారం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆరో విడత హరితహారం కార్యక్రమంలో కెటిఆర్‌

Minister KTR

సిరిసిల్ల: మంత్రి కెటిఆర్‌ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డితో కలిసి నేడు ప్రారంభించారు. ఆవునూరు, వెంకటాపూర్‌ దగ్గర మానేరు వాగులో హరితహారంలో భాగంగా వీరు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్‌ మాట్లాడుతూ..రాష్ట్రంలోని వాగులు, చెరువులు, నదులు, కుంటల పక్కన విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. హరితహారం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో జరుగుతోందన్నారు. భవిష్యత్‌ తరాల కోసమే హరితహారం చేపట్టినట్లు కెటిఆర్‌ తెలిపారు. రాజన్న సిరిసిల్లలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు కోటి 40 లక్షల మొక్కలు నాటినట్లు వెల్లడించారు. సిరిసిల్లలో 19.85 శాతం అడవులు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో అడవులు 33 శాతానికి పెంచాలన్నదే సిఎం కెసిఆర్‌ ఆలోచన అన్నారు. సిఎం ఆలోచన మేరకు రాష్ట్రంలో అడవులను పెంచాలన్నారు. ‌


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/