‘మన్‌కీ బాత్‌, ‘దిల్‌కీ బాత్‌గా మారింది

Prakash-Javadekar
Prakash-Javadekar


న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ నిర్వహిస్తున్న ‘మన్‌కీ బాత్‌ కార్యక్రమం ప్రస్తుతం ‘దేశ్‌కీ బాత్‌, ‘దిల్‌కీ బాత్‌గా మారిందని కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవడేకర్‌ పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన రేడియో జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని విజేతలకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోని రేడియో స్టేషన్లు, అందులో పనిచేసేవారి ప్రాధాన్యతను జవడేకర్‌ కొనియాడారు. ప్రజలు నమ్మదగిన, శక్తివంతమైన ప్రసార మాధ్యమం రేడియో అని అన్నారు. మోడీ విజయవంతంగా కొనసాగిస్తున్న మన్‌కీ బాత్‌ కార్యక్రమంపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 262 రేడియో స్టేషన్లు ఉండగా, వాటిని 500కు పెంచి మళ్లీ రేడియో రంగానికి పూర్వవైభవం తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు. తమ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక 75 రోజుల్లో తీసుకున్న ప్రధాన నిర్ణయాలు తీసుకున్న చర్యలకు సంబంధించిన వివరాలతో ‘జన్‌ కనెక్ట్‌ అనే పుస్తకాన్ని విడుదల చేశారు. విద్యాహక్కు, చట్టం, రిజర్వేషన్‌ ఫలాలు అందరికీ అందించడం సహా అన్ని చట్టాలు జమ్ము-కాశ్మీర్‌లో అమలు చేసి ప్రజల జీవన విధానాన్ని మెరుగు పరిచేందుకే ప్రత్యేక హోదా రద్దు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.


కేంద్ర ప్రకాష్‌ జవడేకర్‌

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/telengana/.https://www.vaartha.com/telengana/