జార్ఖండ్‌లో ఘోర ప్రమాదం, 11 మంది మృతి

road accident
road accident

రాంచీ: జార్ఖండ్‌లోని హజారీబాగ్‌ వద్ద ఘోర ప్రమాదం రోడ్డుప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో 11 మంది మృతిచెందారు. మరో 25మంది తీవ్రంగా గాయపడ్డారు. బ్రేకులు ఫెయిల్‌ అవడంతో ట్రక్కును ఢీకొంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఐతే అకస్మాత్తుగా బ్రేకులు వేసేందుకు డ్రైవర్‌ ప్రయత్నించగా సాధ్యం కాలేదు. దీంతో ఎదురుగా వస్తున్న ట్రక్కును బస్సు ఢీకొట్టింది. బస్సు కింద భాగంలో ఉన్న ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. బ్రేకులు ఫెయిలయ్యాయని డ్రైవర్‌, కండక్టర్‌ గట్టిగా అరిచారని ఓ ప్రయాణికుడు తెలిపాడు. అంతలోనే బస్సు ట్రక్కును ఢీకొట్టిందన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/