పోలీసుల అదుపులో ఐఎస్‌ఐ ఏజెంట్‌

Arrest

న్యూఢిల్లీ: సైనికులకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తున్న ఐఎస్‌ఐ ఏజెంట్‌గా అనుమానిస్తున్న ఓ వ్యక్తిని జలంధర్‌లో పోలీసులు ఇటీవల అరెస్ట్‌ చేశారు. నిందితుడిన ఫజాలికా ప్రాంతానికి చెందని రామ్‌ కుమార్‌గా గుర్తించారు. కుమార్‌ నుంచి రెండు మొబైల్‌ ఫోన్లు, నాలుగు సిమ్‌లను స్వాధీనం చేసుకున్నారు. తాను డబ్బుకు ఆశపడి పాకిస్థాన్‌లోని ఐఎస్‌ఐ ఏజేంట్లతో టచ్‌లో ఉంటున్నానని నిందితుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. ఇండో-పాక్‌ సరిహద్దులో భారత సైన్యానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్‌ ఏజెంట్లతో పంచుకుంటానని చెప్పాడని వెల్లడించారు. సరిహద్దుల్లో భారత జవాన్ల కదలికలపైనా నిందితుడు నిఘా వేసేవాడని చెప్పారు. జమ్ము కశ్మీర్‌ సైనిక ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ నుంచి అందిన సమాచారం మేరకు అతడి కదలికలను పసిగట్టి స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం తదుపరి విచారణ కోసం నిందితుడిని పోలీసులు చంఢీగడ్‌ను తరలించారు.