కశ్మీర్‌లోని తల్లిదండ్రులకు ఉగ్రవాదుల హెచ్చరిక

Hizbul Mujahideen warns people
Hizbul Mujahideen warns people

శ్రీనగర్‌: హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ ఉగ్రవాద సంస్థ ప్రత్యేకించి భారత సైన్యం ఆధ్వర్యంలో నడుస్తున్న ఆర్మీ పాఠశాలల్లో చదివించేందుకు పిల్లలను పంపొద్దని తల్లిదండ్రులను హెచ్చరించింది. సౌత్‌ కశ్మీర్‌లోని సోపియాన్‌ జిల్లాలో ఉగ్రవాదులు బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఆర్మీ స్కూళ్లకు పిల్ల్లను పంపొద్దని బ్యానర్లలో రాసి ఉంచారు. జమ్మూకశ్మీర్‌లో 43 ఆర్మీ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో మూడు సీబీఎస్‌ఈకి అనుబంధంగా ఉన్నాయి. జమ్మూకశ్మీర్‌లో ఉన్న అన్ని ఆర్మీ స్కూళ్లల్లో 15 వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వెయ్యి మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. ఇటీవల విడుదలైన సీబీఎస్‌ఈ టెన్త్ ఫలితాల్లో ఆర్మీ పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. అంతేకాక ఎవరూ కూడా ఓటింగ్‌కు వెళ్లొద్దని, ఓటేస్తే చంపేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పుల్వామా జిల్లాలో 2.38 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/