ఎపి లో పలు చోట్ల భారీ వర్షాలు

ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు

Heavy rains in several places in AP
Heavy rains in several places in AP

Amaravati: ఆంధ్రప్రదేశ్ లో పలు చోట్ల భారీ వర్షాలు కారణంగా ఉదృతంగా  వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం అంబడిపూడిలో విషాదం చోటు చేసుకుంది.

.ఉదృతంగా ప్రవహిస్తున్న తూర్పువాగులో ఇద్దరు విద్యార్ధులు చిక్కుకున్నారు. వీరిలో ఒకరు మృతి చెందారు… మరొకర్ని స్థానికులు రక్షించారు. బాలుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి..

ఇలాఉంటే, రాత్రి నుంచి విస్తారంగా కురుస్తోన్న వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌లో వాగులు, వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి.

ఏపీ రాజధాని గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు పెదపరిమి దగ్గర కొండవీటి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.

దీంతో తుళ్లూరు-గుంటూరు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది..రొంపిచర్ల మండలం మునమాక, తుంగపడు దగ్గర వాగు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో విప్పర్లపల్లి తో సహా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

ప్రకాశం జిల్లా కంభం మండలంలోని రావిపాడు వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గండ్లకమ్మవాగులో ట్రాక్టర్ కొట్టుకుపోయింది..

సహాయక చర్యలు చేపట్టిన పోలీస్, ఫైర్ అధికారులు, ట్రాక్టర్ లో ఉన్న నలుగురు రైతులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చడంతో గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు.

కడప జిల్లా కమలాపురం వయా ఖాజీపేట ప్రధాన రహదారి లో పాగేరు వంక పొంగి పొర్లుతోంది..దీంతో చుట్టు ప్రక్కల 19 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి.

చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం మారేపల్లికి చెందిన హరీష్ అనే యువకుడు గ్రామం పక్కనే ప్రవహిస్తున్న వాగులో నడుచుకుంటూ వెళ్లి ప్రమాదానికి గురయ్యాడు..

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/