దిగ్గజాల వల్ల కానిది ఫైన్‌ సాధిస్తాడా?

Fine
Fine

మాంచెస్టర్‌: యాషెస్‌ సిరీస్‌ అంటే ఆసీస్‌-ఇంగ్లాండ్‌లకు ఎంతో ప్రతిష్టాత్మకం. ఇది ఇరు జట్ల మధ్య జరిగే ఒక యుద్ధంగా చెప్పొచ్చు. మరి అటు మెగా యుద్ధంలో ఒక కెప్టెన్‌కు అరుదైన అవకాశం వస్తే అంతకంటే ఆనందం ఏముంటుంది. అందులోనూ దిగ్గజాల వల్ల కానిది. అనుకోకుండా జట్టు కెప్టెన్‌ అయి దాన్ని సాధిస్తే ఆ ఆనందానికి హద్దే ఉండదు. ఇప్పుడు ఈ తరహా రికార్డే ఆసీస్‌ జట్టు కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ను ఊరిస్తోంది. ఆసీస్‌ దిగ్గజ ఆటగాళ్లు, మాజీ కెప్టెన్లు అయిన గ్రెగ్‌ చాపెల్‌, రికీ పాంటింగ్‌, మైకేల్‌ క్లార్క్‌లకు సాధ్యం కానిది.. పైన్‌ ముంగిట నిలిచింది. ఇంగ్లాండ్‌ గడ్డపై ఆసీస్‌ యాషెస్‌ సిరీస్‌ను గెలిచిన సందర్భాలు చాలా తక్కువే. సుమారు 18ఏళ్ల క్రితం ఇంగ్లాండ్‌లో ఆసీస్‌ చివరిసారిగా యాషెస్‌ సిరీస్‌ గెలిస్తే, అప్పట్నుంచి ఇప్పటివరకు ఇంగ్లాండ్‌ వేదికలో ఆసీస్‌ మళ్లీ ఆ సిరీస్‌ను గెలవలేదు. ఇంగ్లాండ్‌లో 2001లో స్టీవ్‌వా నేతృత్వంలోని ఆసీస్‌ యాషెస్‌ సిరీస్‌ను గెలిచింది. ఆ తర్వాత ఆసీస్‌ ఆ ఛాన్స్‌ ఇవ్వలేదు ఇంగ్లాండ్‌కు. తమ దేశంలో ఓడించడమంటే మీ వల్ల కాదనే విషయాన్ని ఇంగ్లాండ్‌ చాటి చెబుతూనే ఉంది. అయితే తాజా యాషెస్‌ సిరీస్‌లో టిమ్‌ పైనీ నేతృత్వంలోని ఆసీస్‌ 2-1 ఆధిక్యంలో ఉంది. ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ఈ సిరీస్‌లో తొలి టెస్టును ఆసీస్‌ గెలవగా, రెండో టెస్టు డ్రాగా ముగిసింది. ఇక మూడో టెస్టులో ఇంగ్లాండ్‌, నాల్గో టెస్టులో ఆసీస్‌లు విజయం సాధించాయి. దాంతో ఆసీస్‌దే పైచేయిగా ఉంది. ఇక చివరి టెస్టును ఆసీస్‌ గెలిస్తే ఫైన్‌ అరుదైన ఘనతను లిఃస్తాడు. అదే సమయంలో సుదీర్ఘకాలంగా ఇంగ్లాండ్‌ గడ్డపై యాషెస్‌ను గెలవలేకపోతున్న అపవాదుకు కూడా బ్రేక్‌ పడుతుంది. 2010లో ఆసీస్‌ తరపున అరంగేట్రం చేసిన పైన్‌…ప్రధానంగా టెస్టుల్లోనే కనిపిస్తాడు. ఇప్పటివరకు ఆసీస్‌ జట్టుకు అడపా దడపా కెప్టెన్‌గా వ్యవహరించిన పైన్‌…యాషెస్‌ సిరీస్‌ కూడా కెప్టెన్‌గా నియమించింది క్రికెట్‌ ఆస్ట్రేలియా. బాల్‌ ట్యాంపరింగ్‌ కారణంగా స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌లు ఏడాదిపాటు నిషేధం ఎదుర్కోవడంతో వారిని ఆసీస్‌ యాషెస్‌ జట్టుకు కెప్టెన్లుగా నియమించడానికి సిఎ మొగ్గు చూపలేదు. ఆ క్రమంలోనే పైన్‌ కెప్టెన్‌గా ఎంపిక కావడానికి మార్గం సుగమం అయ్యింది. ఇలా యాక్సిండెటల్‌గా ఆసీస్‌కు సారథిగా ఎంపికైన పైన్‌…ప్రస్తుతం జరుగుతున్న యాషెస్‌ సిరీస్‌లో రాణించలేదు. కాకపోతే కెప్టెన్‌గా మాత్రం ఒక మైలురాయిని చేరుకునేందకు చేరువయ్యాడు. గురువారం నుంచి కెన్నింగ్టన్‌ ఓవల్‌ వేదికగా జరగనున్న చివరిదైన ఐదో యాషెస్‌ టెస్టును ఆసీస్‌ గెలిస్తే 3-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. ఫలితంగా ఇంగ్లాండ్‌ గడ్డపై యాషెస్‌ సిరీస్‌లు గెలిచిన కొద్దిమంది ఆసీస్‌ కెప్టెన్ల జాబితాలో పైన్‌ చోటు సంపాదిస్తాడు. మరి ఈ అరుదైన ఫీట్‌ను పైన్‌ సాధిస్తాడో లేదో చూడాలి.