అత్యంత చౌక నగరాల జాబితాలో చెన్నై, ఢిల్లీ, బెంగళూరు

delhi
delhi


వాషింగ్టన్‌: నివాసానికి అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో పారిస్‌, సింగపూర్‌, హాంకాంగ్‌ నగరాలు నిలిచాయి. చౌకైన నగరాల జాబితాలో భారత్‌ నుంచి మూడు నగరాలు నిలిచాయి. కాగా చాలా చౌకైన నగరాల జాబితాలో భారత్‌లోని ఢిల్లీ, చెన్నై, బెంగళూరులో చోటు సంపాదించుకున్నాయి. ఎకనమిక్‌ ఇంటిలిజెంట్‌ యూనిట్‌కు చెందిన 2019 వరల్డ్‌వైడ్‌ కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సర్వే ఈ వివరాలను వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా 133 నగరాల్లో 150 వస్తువుల ధరలను సమీక్షించి..ఈ జాబితాను రూపొందించారు. ఖరీదైన నగరాల జాబితాలో స్విట్జర్లాండులోని జూరిచ్‌ నాలుగో స్థానంలో ఉండగా..జపాన్‌లోని ఒసాకో, స్విట్జర్లాండ్‌లోని జెనీవా కలిసి ఐదో స్థానాన్ని పంచుకున్నాయి.
ప్రపంచంలోనే నివాసానికి అత్యంత చౌకైన నగరాల జాబితాలో కరాకస్‌(వెనుజులా), డమస్కస్‌(సిరియా), తాష్కెంట్‌( ఉజ్జెకిస్థాన్‌). అలమటి(కజకిస్థాన్‌), కరాచీ(పాకిస్థాన్‌), లాగోస్‌(నైజీరియా)లతో పాటు భారత్‌కు చెందిన బెంగళూరు, చెన్నై, రాజధాని నగరం ఢిల్లీ కూడా ఉన్నాయి.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/