నిమ్స్‌లో కొనసాగుతున్న కోవాగ్జిన్ ట్రయల్స్

ఏడుగురికి రెండో విడత డోస్

Covaxin-Clinical-Trials-Starts-in-NIMS

హైదరాబాద్: నిమ్స్ లో భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ ‘కోవాగ్జిన్’ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. తొలి దశలో 50 మందికి వ్యాక్సిన్ ఇచ్చిన వైద్య బృందం, ఆపై వారిలో ఏడుగురికి బూస్టర్ డోస్ ను ఇచ్చారు. మరో 43 మందికి దశలవారీగా బూస్టర్ డోస్ ను అందించనున్నారు. ఆపై వీరందరి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వీడియో కాల్ ద్వారా వైద్యులు నిత్యమూ పరిశీలిస్తున్నారు. తొలి, రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారందరి ఆరోగ్యమూ బాగానే ఉందని వైద్య బృందాలు నిర్దారించాయి. ఒకసారి వ్యాక్సిన్ తీసుకున్న తరువాత, 24 గంటలు ఆసుపత్రిలోనే ఉంచి, ఆరోగ్యం బాగుంటేనే వారిని ఇళ్లకు పంపుతున్నారు. ప్రస్తుతం ఎంపిక చేసిన వారికి నిర్ధారిత సమయాల్లో రెండో డోస్ ను ఇస్తున్నామని నిమ్స్ అధికారులు వెల్లడించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/