కుంకుమతో జాగ్రత్త!

Kumkuma bottu
Kumkuma bottu

నుదుటన కుంకుమ సౌభాగ్యానికి చిహ్నం. ఇదివరకు కుంకుమను ఇంట్లోనే తయారు చేసేవారు. తరువాత కొనడం ప్రారంభమైంది. బయట లభించే కుంకుమలో చాలా రకాలు వచ్చాయి. ప్రస్తుతం కొన్ని రకాలు ఇబ్బందికరంగా మారాయి.

కుంకుమలో రంగు, సువాసన కోసం సీసం, పాదరసం, కర్పూరం, పారా బెంజైన్‌, సింథటిక్స్‌, జింక్‌ వంటివి కలుపుతున్నారు. వీటివల్ల చర్మసంబంధిత అలర్జీలు ఇబ్బంది పెడుతాయ.ఇ మరీ సున్నిత చర్మతత్వం ఉన్నవారికైతే బొబ్బలు, దద్దుర్లు లాంటివి కూడా రావచ్చు. అలాగని బొట్టు బిళ్లలు కూడా అంత మంచివికావు. అదే కుంకుమను ఇంట్లో తయారు చేసుకుంటే ఏ సమస్యా ఉండదు. పసుపు పొడిలో నిమ్మరసం కలిపితే కుంకుమ తయారవుతుంది. అదే అలానే పూర్వపు రోజుల్లో గంధపు చెక్కతోనూ చేసేవారు.

రెడ్‌ మార్బుల్‌ స్టోన్‌ మీద పసుపు, నూనె వేసి కదిలించకుండా నాలుగైదు రోజులు ఉంచితే మంచి రంగులో కుంకుమ తయారవుతుంది. దీనివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. అయితే కొందరు పసిపిల్లలకు కుంకుమ పెడుతుంటారు.

కాని పసిపిల్లలకు కుంకుమ పెట్టడం మంచిదికాదు. ఎందుకంటే పసిపాపల చర్మం మరీ సున్నితంగా ఉంటుంది. పిగ్మెంటేషన్‌, మచ్చలు, కందిపోవటం వంటివి వచ్చే అవకాశముంటుంది. ఎగ్జిమా ఉన్నా ఇలానే రావచ్చు. కేవలం కుంకుమ వాడకం వల్లనేనా లేక ఇంకేదైనా సమస్య ఉందేమో కూడా గమనించుకోవాలి. కుంకుమ వల్ల వస్తే మాత్రం ముఖాన్ని ఎప్పుడూ శుభ్రంగా తేమగా ఉంచడం మంచిది.

వైద్యుల సలహాతో ఎప్పటికప్పుడు మాయిశ్చరైజర్లు, సహజ నూనెలతో మర్దన చేస్తుండాలి. చిన్నపిల్లలు కాబట్టి ఘాటైన రసాయనాల మిళితంగా తయారు చేసిన ఆయింట్‌మెంట్లు, స్టెరాయిడ్‌ క్రీంలు వాడటం అంత మంచిది కాదు. కాలక్రమేణా వాటిని తగ్గించాలి. అలానే వైద్యుల సలహాను పాటించాలి. కుంకుమలో హానికారక రసాయనాలు కలవడం వల్ల కూడా ఇలా అవుతుంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/