శరీరానికి తగినంత నీటిని తాగాలి

DRINKING WATER
DRINKING WATER

దాహం వేసినప్పుడు చాలామంది ఫ్రిజ్‌ వాటర్‌ని తాగుతుంటారు. కానీ ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదని తెలిసినా తాగేస్తుంటారు. చల్లనీటి కంటే గోరువెచ్చని నీటిని తాగడం అన్నివిధాలుగా మంచిదని నిపుణులు అంటున్నారు. అంతేకాదు మన దేహానికి సరిపడ నీటిని దేహానికి పంపిస్తూ ఉండాలి. ఏదో దాహం వేసినప్పుడు కాదు.
నీరు మనదేహంలో ఎంతో ప్రముఖస్థానాన్ని వహిస్తోంది. ముఖ్యంగా ఆరోగ్య పరిరక్షణలో ఎలాంటి పాత్ర వహిస్తుందో తెలుసుకుందాం.
మనశరీరంలో 60-70శాతం ఉన్నది నీరే. మెదడు, కండరాలు, ఊపిరితిత్తులు, రక్తంలో ప్రధానభాగం నీరే ఉంది. మన శరీర ఉష్ణోగ్రతను మెయిన్‌టెయిన్‌ చేసేది నీరే. మన శరీరంలోని అన్ని భాగాలకూ న్యూట్రియంట్సును పంపేది నీరే. శరీరంలోని ఆక్సిజన్‌ను కణానికి నీరే తీసుకువెళుతుంది. శరీరంలోని మలినాలను తొలగించేది, జీర్ణక్రియకు తోడ్పడేది, రక్తం, మూత్రం తయారీల్లో ప్రముఖపాత్ర వహిస్తోంది నీరే. శరీరంలో నీటిశాతం తగ్గితే, డీ హైడ్రేషన్‌ రకరకాల తలనెప్పులు, కీళ్లనెప్పులు, కండరాల నెప్పులు ప్రారంభం అవ్ఞతాయి. సరైన మంచినీరు శరీరానికి మీరు అందించకపోతే, మలబద్దకం ఏర్పడి అనేక రుగ్మతలకు దారితీస్తుంది. అందుకే శరీరానికి తప్పనిసరిగా మంచినీరు అందించటం మనందరి ప్రథమ కర్తవ్యం. ప్రతి మనిషీ రోజుకు 5,6 లీటర్ల నీరు త్రాగాలి. వ్యాయామం చేసే సమయంలో ప్రతీ ఇరవై నిముషాలకి క్వార్టర్‌ లీటర్‌ నీరు విధిగా తాగాలి. విమాన ప్రయాణం చేసేటప్పుడు ప్రతీ గంటకూ పావ్ఞలీటరు నీరు తప్పక తాగాలి. మంచినీరు సమయానికి అందకపోతే డీహైడ్రేషన్‌కు గురై అదే సమయంలో మెటబాలిజం రేటే మూడు శాతం వరకూ తగ్గిపోతుంది. మంచినీరు శరీరానికి అందకపోతే మీరు నీరసించిపోతారు.