మూడోరోజు ఈడీ ముందుకు వాద్రా

robert vadra
robert vadra

న్యూఢిల్లీ: ప్రియాంక గాంధీ భర్త రాబర్డ్‌ వాద్రా వరుసగా మూడోరోజు ఈడీ ముందు విచారణకు హాజరుకానున్నారు. ఆయనన్ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. అయితే ఈరోజు వాద్రాతో పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ సమావేశమయ్యారు. ఉదయం ఆయన నివాసానికి వెళ్లిన సిద్ధూ.కొద్దిసేపటి తర్వాత మళ్లీ తిరిగి వెళ్లిపోయారు. అక్రమాస్తుల ఆరోపణలపై ఈడీ విచారణ ముమ్మరమైన తరుణంలోనే వాద్రాతో సిద్ధూ సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ భేటీకి గల కారణాలు ఇంకా వెల్లడికాలేదు.