ప్రియాంకను కలుపుకుందామా..?

akhilesh , priyanka, mayawati
akhilesh , priyanka, mayawati

పొత్తులపై ఎస్‌పి,బిఎస్‌పి తర్జనబర్జనలు
లక్నో: ప్రియాంకగాంధీ కాంగ్రెస్‌ప్రత్యక్ష రాజకీయాల్లోనికి వచ్చిననేపథ్యంలో ఇపుడు ఉత్తరప్రదేశ్‌ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఇప్పటివరకూ కాంగ్రెస్‌ను విస్మరించిందని పేర్కొంటున్న సమాజ్‌వాదిపార్టీ, బహుజన్‌సమాజ్‌పార్టీలు ఇపుడు కాంగ్రెస్‌ పార్టీపై ఆసక్తిచూపిస్తున్నాయి. ప్రియాంకగాంధీని యుపిఈస్ట్‌ వ్యవహారాల ఇన్‌చార్జిగా నియమించడంతో ప్రజల్లో మరింతపరపతి పెరుగుతుందని, ఆదరణ బహుముఖంగా ఉన్నందున తమ రెండుపార్టీలకు సైతం కలిసివస్తుందని భావిస్తున్నాయి. ఇపుడిపుడే పొత్తులపై ఎస్‌పిబిఎస్‌పిలు పునరాలోచనలో పడ్డాయి. అఖిలేష్‌,మాయావతిలు కలవడంతో రాజకీయాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. త్వరలోనే అభ్యర్ధుల జాబితాను సిద్ధంచేసి ప్రకటించేందుకు రెడీ అవుతున్న దశలోరెండుపార్టీలనేతలు ఇపుడు కాంగ్రెస్‌ పార్టీని తమవైపు తీసుకుంటే ఎలా ఉంటుందన్న భావనకు వచ్చాయి. ఇప్పటివరకూ పొత్తులసందర్భంగా కాంగ్రెస్‌ పార్టీని ఈ రెండుపార్టీలు విస్మరించాయి. ఇపుడు ప్రియాంక గాంధీ ప్రవేశంతో మళ్లీ ఆలోచనలో పడ్డారు. ఇప్పటికే ఎస్‌పి,బిఎస్‌పిల అభ్యర్ధులు నిర్ణయించినట్లు వినిపిస్తోంది. జాబితాకు ఫైనల్‌టచ్‌ ఇచ్చేపనిలో ఉన్నారు. ఫిబ్రవరిలో తొలిజాబితానుసైతం ప్రకటిస్తామని చెపుతున్నారు. ఇదేసమయంలో కాంగ్రెస్‌ను కూడా తమతో కలుపుకుంటేమరింత లాభం కలుగుతుందన్న ఆలోచనకు వచ్చారు. ఇక బిఎస్‌పికి పశ్చిమ ఉత్తరప్రదేశ్‌, బుందేల్‌ఖండ్‌ప్రాంతాల్లో సీట్లకు అధికప్రాధాన్యత ఇస్తే సమాజ్‌వాదిపార్టీకి తూర్పు ఉత్తరప్రదేశ్‌, మధ్యయూపిలో అధికసంఖ్యలో సీట్లను కేటాయించుకున్నారని తెలుస్తోంది. చెరి 38 స్థానాల్లో పోటీచేసేందుకు పొత్తుల్లో భాగంగా ముందే నేతలు ప్రకటించారు. మిషన్‌ 30 వ్యూహంలోభాగంగా కాంగ్రెస గెలవాలని చూస్తున్న సీట్లపైకూడా ఈ రెండుపార్టీలు ఇపుడు మదనపడుతున్నాయి. ఇందులోభాగంగానే 15 సీట్లకు అభ్యర్ధులనుప్రకటించాల్సి ఉంది. సహరాన్‌పూర్‌, గజియాబాద్‌, ఖుషీనగర్‌,మీర్జాపూర్‌, ఖేరి, లక్నో, దౌరారా, ఉన్నవ్‌, ప్రతాప్‌ఘడ్‌, బారాబంకి, కాన్పూరు, ఫైజాబాద్‌, గోండా నియోజకవర్గాలకు అభ్యర్ధులను సత్వరమేప్రకటించాలని ఎస్‌పిబిఎస్‌పిలు భావిస్తున్నాయి. ఈ సీట్లపై కాంగ్రెస్‌ పార్టీకి మంచి పట్టు ఉందని పసిగట్టాయి. లేనిపక్షంలో హస్తం చేతిని అందుకుని ఆ పార్టీని కూడా కలుపుకుని ముందుకువెళ్లాలనినిర్ణయించినట్లు సమాచారం. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీకి లక్షకుపైగా ఓట్లు వచ్చాయి. ఇపుడు ప్రియాంక రాజకీయాల్లోనికి రావడంతో సమీకరణాలు శరవేగంగా మారే అవకాశాలున్నాయి. ప్రియాంకగాంధీ ఎంట్రీ ఒక కారణమౌతే బిజెపి కూడా అక్కడ తనప్రభావంచూపించే అవకాశం ఉండటంతో ఎట్టిపరిస్థితుల్లోను 30 సీట్లు తమ ఖాతాలోనే ఉండాలనిఅఖిలేష్‌ భావిస్తున్నారు. ఇలా ఉంటే కొద్దిరోజులక్రితమే ఎస్‌పిబిఎస్‌పిలు అధికారికంగా పొత్తుపెట్టుకుంటున్నట్లుప్రకటించి సంచలనం కలిగించాయి. కేంద్రంలోప్రభుత్వ ఏర్పాటులో ఉత్తరప్రదేశ్‌ కీలకం కావడంతో దేశం మొత్తం ఆరాష్ట్రరాజకీయాలవైపేచూస్తోంది.