ట్రంప్‌కు చుట్టుకున్న మ‌రో వివాదం

Donald Trump
Donald Trump

వాషింగ్టన్‌: ట్రంప్‌ అంటేనే వివాదాలకు మారు పేరుగా మారిపోయారు. నిత్యం ఏదో ఒక వివాదం అతణ్ని చుట్టూముడుతూనే ఉంది. అక్కడి మీడియా కొత్తంగా ఒక విషయాన్ని బహిర్గతపరచింది. ఎన్నికల్లో తనకు అడ్డు రాకూడదని ఓ ఫోర్న్‌ తారకు డబ్బిచ్చి నోరుమూయించారని వెల్లడించింది. 2006లో జరిగిన ఓ గోల్ఫ్‌ లీగ్‌ సమయంలో ట్రంప్‌కు స్టెపానీ క్లీఫోర్ట్‌ అనే ఫోర్న్‌ తార పరిచయం ఏర్పడింది. తర్వాత కూడా ట్రంప్‌ ఆమెను కలిశాడు. ఎన్నికల సమయంలో ఈ విషయాన్ని బయటికి వెల్లడి కావద్దని తన లాయర్‌ ద్వారా స్టెఫానీకు 1,30,000 డాలర్లు ముట్టజెప్పాడని అక్కడి మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ఈ వార్తలను శ్వేతసౌధం కొట్టివేసింది. అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో చాలా మంది మహిళలు ట్రంప్‌పై లైంగికవేధింపుల ఆరోపణలు చేసిన సంగతి విదితమే.