జీఎస్టీ వల్ల ప్రభుత్వంపై రూ.700 కోట్ల భారం: మంత్రి యనుమల

YANUMALA
YANUMALA RAMAKRUSHNUDU

అమరావతి: ఏపి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉందని రాష్ట్ర మంత్రి యనుమల రామకృష్ణుడు
తెలిపారు. ప్రస్తుతం ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం రుణం పొందేందుకు అర్హత ఉందన్నారు. మొత్తం
రూ.7వేల కోట్ల రుణానికి అర్హత ఉందని వివరించారు. కార్పోరేషన్ల్‌ రుణాలు పొందేందుకు ప్రభుత్వం
సాయం చేస్తుందన్నారు. వర్కర్లు, గుత్తేదారులపై 12 శాతం జీస్టీ వల్ల ప్రభుత్వంపై రూ.700 కోట్ల భారం
పడుతుందన్నారు. రైతు రణమాఫీకి రూ.3వేల కోట్లు, డ్వాక్రా సంఘాల రుణమాఫీకి రూ.2వేల కోట్లు
విడుదల చేస్తామని ప్రకటించారు.