చంద్రబాబును ఈ కేసులోకి లాగాలని చూస్తున్నారు


హైదరాబాద్‌ :ఓటుకు నోటు కేసులో వరుసగా రెండో రోజన రేవంత్ రెడ్డి విచారణ ముగిసింది. అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఈడీ అధికారులు విచారణ పేరిట నిన్నటి నుంచి అడిగిన ప్రశ్నలే అడుగుతున్నారని, తనను వేధిస్తున్నారని ఆరోపించారు. ఏపీ సీఎం చంద్రబాబును ఈ కేసులోకి లాగాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఈ కేసు విషయంలో చంద్రబాబుకు గతంలోనే క్లీన్ చిట్ ఇచ్చినా, మళ్లీ ఆయన పేరును తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్, మోదీ ఒత్తిడితో ఈడీ అధికారులు పనిచేస్తున్నారని, ఈ కేసులో రాజకీయ కుట్ర కనిపిస్తోందని, చంద్రబాబు టార్గెట్ గా ఈడీ ప్రశ్నలు ఉన్నాయని అన్నారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే, హైకోర్టు కొట్టేసిన కేసును తిరగదోడుతున్నారని టీకాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు.