కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ ఇంజిన్‌లో సాంకేతిక లోపం

TRAIN
TRAIN

నిజామాబాద్‌-సికింద్రాబాద్‌ మార్గంలో పలు రైళ్లు నిలిచిపోయాయి. మనోహరాబాద్‌ వద్ద కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ ఇంజిన్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో ఆదిలాబాద్‌-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ మాసాయిపేటలో నిలిపివేశారు. ఈ కారణంగా పడియారం, మీర్జాపల్లి, అక్కన్నపేట రైల్వేస్టేషన్లలో పలు రైళ్లు నిలిచిపోయాయి. గంటకు పైగా కృష్ణాఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.