కుల్‌భూషణ్‌పై పాకిస్థాన్‌ ఒత్తిడి!

గుఢచర్యం చేసినట్లుగా ఒప్పించే ప్రయత్నం

kulbhushan
kulbhushan


న్యూఢిల్లీ: ఆర్టికల్‌ 370 రద్దుతో ఖంగుతిన్న పాకిస్థాన్‌ భారత్‌ను ఏదోలా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నది. గూఢచర్యం ఆరోపణలపై పాక్‌ చెరలో ఉన్న కుల్‌భూషన్‌ జాదవ్‌పై తీవ్ర ఒత్తిడి పెడుతున్నది. ఈమేరకు భారత విదేశాంతశాఖ సోమవారం తెలిపింది. జాదవ్‌ నిజంగా గూఢచర్యం చేశానని ఒప్పుకొనేలా పాకిస్థాన్‌ అధికారులు ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. సోమవారం కుల్‌భూషణ్‌కు పాకిస్థాన్‌ కాన్సులర్‌ అనుమతి కల్పించిన సంగతి తెలిసిందే. భారత రాయబారి గౌరవ్‌ అహ్లూవాలియా కుల్‌భూషణ్‌ను కలిసారు. వీరిద్దరి మధ్య రెండుగంటల సేపు సమావేశం జరిగినట్లుగా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీశ్‌కుమార్‌ మీడియాకు తెలిపారు. అతనికి సంబంధించిన వీడియోలను పాక్‌ నాలుగింటిని విడుదల చేసింది. చాలాకాలంగా న్యాయపోరాటం తర్వాత కుల్‌భూషన్‌ జాదవ్‌కు కాన్సులర్‌ అనుమతి లభించిన విషయం తెలిసిందే.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/national/