ఆడవాళ్ల జోలికోస్తే కఠిన చర్యలు

ap dgp takur
ap dgp takur

అమరావతి: ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసులే వారిని వేధిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసు ఉన్నతాధికారులను డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ హెచ్చరించారు. ఆడవాళ్లతో ఎవరు ఆసభ్యంగా ప్రవర్తించినా ఉపేక్షించోద్దు. మీరు కఠినంగా వ్యవహరించకుంటే మీపై నేను చర్యలు తీసుకుంటాను అని ఠాకూర్‌ అన్నారు. రాష్ట్రంలో రెండు రోజుల్లో జరిగిన రెండు వరుస ఘటనల్లో పోలీసులపై ఆరోపణలు రావడం పట్ల పోలీస్‌ బాస్‌ తీవ్రంగా స్పందించారు విజయవాడకు చెందిన ఒక యువతి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తోంది. ఇటీవల విజయవాడ బస్టాండ్‌లో బస్‌ కోసం వేచియున్న ఆమెను ఇద్దరు వ్యక్తులు లైంగికంగా వేధించారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, అసలు గుట్టు బయటపడింది. ఆమెపై వేధింపులకు పాల్పడిన ఇద్దరూ పోలీసు కానిస్టేబుళ్లేనని తేలింది. ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌ పోలీసు విభాగంలో పనిచేస్తున్న వెంకటేశ్‌, మాధవరావు గా వీరిని గుర్తించారు. వెంకటేశ్‌ది నెల్లూరు జిల్లా వెంకటగిరి అని, మాధవరావు స్వస్థలం గుంటూరు జిల్లా మంగళగిరి అని తేలింది. వారిని సస్పెండ్‌ చేయాలని, అరెస్టు చేసి విచారించాలని డీజీపీ ఆదేశించినట్లు తెలిసింది.