సీఏఏ భారత అంతర్గత వ్యవహారం: కేంద్రం

సుప్రీంలో సీఏఏపై ఐక్యరాజ్యసమితి పిటిషన్… ఘాటుగా బదులిచ్చిన కేంద్రం

CAA
CAA

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) పై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ సీఏఏపై జోక్యం చేసుకోవాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై కేంద్రం ఘాటుగా బదులిచ్చింది. ఐక్యరాజ్యసమితి చర్యను ఖండించింది. సీఏఏ పూర్తిగా భారతదేశ అంతర్గత వ్యవహారమని, ఇందులో జోక్యం చేసుకునే అధికారం మరే ఇతర దేశానికి గానీ, బయటి వ్యవస్థలకు గానీ లేదని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ స్పష్టం చేశారు. ఓ సార్వభౌమ దేశంగా చట్టాలు చేసే హక్కు భారత్ కు ఉందని, సీఏఏ రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉందన్న విషయంలో భారత్ స్పష్టమైన వైఖరితో ఉందని తెలిపారు. రాజ్యాంగపరంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని సుప్రీం కోర్టు కూడా నిర్ధారిస్తుందని నమ్ముతున్నామని ఓ ప్రకటనలో వెల్లడించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/