అంపైర్లు సీరియస్‌గా దృష్టి సారించాలి…

Srikanth Kidambi
Srikanth Kidambi

న్యూఢిల్లీ: ఈ ఐపిఎల్‌ సీజన్‌లో మ్యాచ్‌లు నిర్ణీత సమయంలో ముగియకపోవడంపై మాజీ క్రికెటర్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ అసిస్టెంట్‌ కోచ్‌ మహ్మద్‌ కైఫ్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ విషయంలో అంపైర్లు సీరియస్‌గా దృష్టి సారించాల్సిన అవసరం ఉందంటూ విన్నవించారు. ఐపిఎల్‌ మ్యాచ్‌లు ముగుస్తున్న సమయాన్ని అంపైర్లు పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. దాదాపు ప్రతీ మ్యాచ్‌ అర్థరాత్రి 12గం.లకు ముగుస్తుంది. ఆయా జట్లు ఫీల్డింగ్‌ సర్దుబాటు చేసుకునే క్రమంలో మ్యాచ్‌లు ఆలస్యమవుతున్నాయి. ఏ ఫీల్డర్‌ని ఎక్కడ పెట్టాలనే సందిగ్ధంలో సమయాన్ని వృథా చేస్తున్నారు. దీనిపై అంపైర్లు దృష్టి నిలపాలి. నిర్ణీత సమయానికి మ్యాచ్‌లు ముగిసే విధంగా చర్యలు తీసుకోండని కైఫ్‌ పేర్కొన్నాడు. ఇప్పటికే ఐపిఎల్‌ మ్యాచ్‌లలో కొన్ని జట్లు అనుసరిస్తున్న ఫీల్డింగ్‌ వ్యూహాలను కైఫ్‌ తప్పుబట్టిన సంగతి తెలిసిందే. తుది జట్టులో ఉన్న ఆటగాళ్లలో మందకొడిగా ఫీల్డింగ్‌ చేసేవారు ఎవరైనా ఉంటే వారి స్థానాల్లో కావాలని చురుకైన ఫీల్డర్లను తీసుకొస్తున్నారని…తగిన కారణం లేకుండా సబ్‌స్టిట్యూట్‌లను వాడుకోవడం సరైందికాదని కైఫ్‌ వ్యాఖ్యానించాడు.
మరిన్నీ తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చెయండి :