ఎన్టీఆర్‌ కుమార్తె ఉమామహేశ్వరి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏంతేలిందంటే…

దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుమార్తె  కంఠమనేని ఉమామహేశ్వరి సోమవారం తన నివాసంలో ఉరి వేసుకొని మృతి చెందిన విషయం తెలిసిందే. ఈమె మరణం నందమూరి కుటుంబంలో విషాదం నింపింది. ఈమె మరణ వార్త తెలిసి సినీ , రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేసారు. బుధువారం ఈమె అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరిగాయి.

ఇదిలా ఉంటె ఉమామహేశ్వరి కి సంబదించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాయి. ఈ రిపోర్ట్ లో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. ఉస్మానియా ఫొరెన్సిక్ వైద్యులు జూబ్లీహిల్స్ పోలీసులకు అందించిన నివేదికలో ఈ మేరకు పేర్కొన్నారు. ముందుగా ఉమా మహేశ్వరిది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ఆత్మహత్యగా మార్చి దర్యాప్తు చేస్తున్నారు.

ఇక నందమూరి తారకరామారావుకు మొత్తం 12 మంది సంతానం. వారిలో ఎనిమిది మంది కుమారులు కాగా, నలుగురు కూతుళ్లు. వీళ్లలో ముగ్గురు కుమారులు చనిపోయారు. పెద్ద కుమారుడు రామకృష్ణ ఎన్టీయార్‌ బతికి ఉండగానే చనిపోగా.. మిగతా ఇద్దరు కుమారులు ఎన్టీయార్‌ స్వర్గస్థులైన తర్వాత చనిపోయారు. ఇప్పుడు ఆయన చిన్న కూతురు ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారు దీంతో, ఎన్టీయార్‌ సంతానంలో ముగ్గురు కుమారులు, ఓ కూతురు మరణించారు. ఆయన 12 మంది సంతానంలో మొత్తం నలుగురు చనిపోయారు. దీంతో, ఇప్పుడు ఐదుగురు కుమారులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.