మద్యం దుకాణంపై ఆవుపేడతో దాడి చేసిన మాజీ సీఎం

మధ్యప్రదేశ్ మాజీ సీఎం, భాజపా ఫైర్ బ్రాండ్ గా పిలుచుకునే ఉమా భారతి..తాజాగా మద్యం దుకాణం ఫై ఆవుపేడతో దాడి చేయడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. మద్యపానాన్ని నిషేధించాలని సొంత ప్రభుత్వంపైనే కొంతకాలంగా ఉమా భారతి ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ మద్యపానాన్ని నిషేదించకపోవడం తో ఉమా భారతి స్వయంగా రంగంలో దిగి మద్యం దుకాణాలపై దాడి చేయడం మొదలుపెట్టింది. మధ్యప్రదేశ్‌లోని నివారి జిల్లాలో ఆధ్యాత్మిక నగరం ఓర్చాలో మద్యం దుకాణం పెట్టడం ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దానిపై ఆవు పేడ వేసి తన నిరసన వ్యక్తం చేసింది. ఎంతో పవిత్రమైన ఓర్చా నగరంలో ఇలాంటి వ్యాపారం చేయడం నేరమంటూ ఉమా భారతి ఆగ్రహం వ్యక్తంచేశారు.

‘‘ఓర్చా నగరం ప్రధాన ద్వారం వద్ద వైన్ షాపు ఉంది.. అనుమతిలేని ప్రదేశంలో ఆ దుకాణం ఏర్పాటుచేశారు. దీనిపై ప్రజలు, మా సంస్థ సభ్యులు తరుచూ ఆందోళనలు తెలుపుతూ ఈ దుకాణాన్ని అక్కడి నుంచి తీసేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పదే పదే కోరుతున్నారు.. వినతి పత్రాలూ అందజేస్తున్నారు.. పవిత్రమైన నగరం నుదుటిన ఈ దుకాణం పెద్ద కళంకంగా ఉన్నందున దాన్ని మూసేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.. ఈ విషయంలో ప్రజల నుంచి వస్తోన్న స్పందనలను నేరంగా భావించలేం…. ఎందుకంటే అక్కడ ఈ దుకాణం తెరవడమే ఓ పెద్ద నేరం’’ అని ఉమాభారతి వ్యాఖ్యానించారు.

‘‘శ్రీరామ నవమి సందర్భంగా ఓర్చాలో నిర్వహించిన దీపోత్సవ్‌ రోజున ఐదు లక్షల దీపాలు వెలిగించిన సమయంలోనూ ఈ దుకాణం తెరిచి ఉందని నాకు సమాచారం వచ్చింది.. ఇది అయోధ్యలా పవిత్రమైనది.. అందుకే పవిత్రమైన గోశాలలోని ఆవుపేడను మద్యం షాపుపై విసిరికొట్టాను.. అయినా మా భావజాలానికి చెందిన సంస్థలు నిరసన తెలిపినప్పటికీ ఇంకా ఆ దుకాణం ఉంచడం సిగ్గుచేటు’’ మండిపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ కావడం తో నెటిజన్లు ఉమా కు సపోర్ట్ గా నిలుస్తున్నారు.

6. शराबबंदी राजनीतिक नहीं सामाजिक अभियान है। समाज की शक्ति और एकता से ही इसका समाधान होगा, किंतु ओरछा के दरवाजे पर रामराजा सरकार के दर्शन के लिए आते और जाते हुए यह शराब की दुकान हमारी रामभक्ति को चुनौती दे रही है। pic.twitter.com/2Y7vlRuBLn— Uma Bharti (@umasribharti) June 14, 2022