గొల్లపూడిలో దేవినేని ఉమా అరెస్టు

devineni uma
devineni uma

అమరావతి: అమరావతిలోనే రాజధాని ఉండాలంటూ ఆ ప్రాంత రైతుల ఆందోళకు దిగారు. వారికి సంఘీభావంగా టిడిపి నేత మాజీ మంత్రి దేవినేని ఉమా కూడా గొల్లపూడిలో రోడ్డుపై భైఠాయించారు. అమరావతినే రా జధానిగా కొనసాగించాలని రైతులతో పాటు దేవినేని ఉమా డిమాండ్‌ చేశారు. జతీయ రహదారిపైకి వేలాదిగా మహిళలు, రైతులు ఈ నిరసనకు తరలివచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. రాజధాని రైతుల నిరసన ఉద్రిక్తతంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి నిరసనను అడ్డుకోవడంతో రైతులకు పోలీసులకు తీవ్ర వాగ్వదం జరిగింది. దీంతో పరిస్థితులను అదుపుచేయాటానికి పోలీసులు దేవినేని ఉమాను అరెస్టు చేశారు. ఇంకా అక్కడ ముఖ్య నేతలను రైతులను అదుపుతోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/