అంతర్జాతీయo

రష్యా సైన్యాన్ని అడ్డుకునేందుకు దెమిదివ్ గ్రామస్థుల సాహసం

రష్యా యుద్ధ ట్యాంకులు వెళ్లకుండా కృత్రిమ వరదలు

Ukrainians flood village to stop Russian advance on Kyiv

కీవ్: ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. ఉక్రెయిన్ మాత్రం పట్టుదలగా పోరాడుతూనే ఉంది. ఇప్పటికే చాలా నగరాలను రష్యా చేజిక్కించుకున్నా.. దేశాన్ని కాపాడుకునే ఏ ఒక్క చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ప్రజలూ పెద్ద సాహసాలే చేస్తున్నారు. అందులో భాగంగానే ఊర్లను కావాలనే జనాలు వరదల్లో ముంచేస్తున్నారు. పొరుగున పారే నదుల్లో మోటార్లు వేసి నీటిని తోడి గ్రామాల్లోకి మళ్లిస్తున్నారు. అలాంటి ఘటనే రాజధాని కీవ్ కు సమీపంలోని దెమిదివ్ గ్రామంలో జరిగింది. రష్యా యుద్ధ ట్యాంకులు వెళ్లలేకుండా ఊరు మొత్తాన్ని గ్రామస్థులు వరద నీటితో ముంచేశారు. దినిప్రో నది నుంచి మోటార్ల ద్వారా నీటిని తోడిపోస్తున్నారు.

ఉక్రెయిన్ పై రష్యా చేసిన దండయాత్ర కన్నా ఈ నష్టం కష్టం తమకు పెద్దదేమీ కాదని గ్రామస్థులు తల ఎత్తుకుని సగర్వంగా చెబుతున్నారు. రష్యాను మట్టికరిపించేందుకు ఏదైనా చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఊరిని వరదల్లో ముంచేసినందుకు ఏ ఒక్కరికీ బాధ లేదని గ్రామస్థులు చెబుతున్నారు. రష్యా నుంచి తమ దేశాన్ని, ప్రాంతాన్ని, భూభాగాన్ని కాపాడుకునేందుకు ఇదో చిన్న ప్రయత్నమని చెప్పుకొచ్చారు. ఇక, గత నెలలో వచ్చిన వరదల కారణంగా పలు ప్రాంతాల నుంచి రష్యా తన బలగాలను వెనక్కు రప్పించుకుంది. అంటే రష్యా వెనకడుగు వేయడంలో వరదలు కూడా సాయం చేశాయి. ఈ నేపథ్యంలోనే దెమిదివ్ గ్రామస్థులు ఉడుతాభక్తిగా తమ ఊరిని ముంచేసుకున్నారు.

కాగా, ధైర్యం అనేది ఉక్రెయిన్ ప్రజల డీఎన్ఏల్లోనే ఉందని ఉక్రెయిన్ ప్రభుత్వాధికారి మిఖాయిల్ ఫెడోరోవ్ చెప్పారు. ఊరిని వరదలతో ముంచేసిన ఫొటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఆయన.. ఈ నిర్ణయం వల్ల రాజధాని కీవ్ లో బలగాలు డిఫెన్సివ్ చర్యలను చేపట్టేందుకు అవకాశం దొరికినట్టయిందన్నారు. సాధారణ పౌరులు కూడా హీరోల్లామారి విజయం కోసం పోరాడుతున్నారని కామెంట్ చేశారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/

Suma Latha

Recent Posts

మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న జూ. ఎన్టీఆర్

జూ. ఎన్టీఆర్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. ప్రాణాపాయస్ధితిలో ఉన్న అభిమాని కుటుంబానికి ధైర్యం చెప్పి ఆ కుటుంబంలో…

9 hours ago

జులై 01 నుండి ఓటిటి లో ప్రసారం కాబోతున్న విరాటపర్వం

ఓటిటిలు వచ్చినప్పటి నుండి చిన్న , పెద్ద అనే తేడాలు లేకుండా ఏ సినేమైనా రిలీజ్ అయినా రెండు వారాల్లోపే…

10 hours ago

‘పక్కా కమర్షియల్’ ట్రైలర్ రిలీజ్

పక్కా కమర్షియల్ నుండి కమర్షియల్ ట్రైలర్ వచ్చి ఒక్కసారిగా సినిమా ఫై అంచనాలు పెంచేసింది. ప్ర‌తి రోజు పండ‌గే లాంటి…

10 hours ago

ముఖ్యమంత్రి పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేసారు. బలపరీక్షకు సుప్రీం కోర్టు అనుమతివ్వడంతో థాక్రే కీలక నిర్ణయం తీసుకున్నారు.…

10 hours ago

పెళ్లి వార్తల ఫై హీరో రామ్ క్లారిటీ ..

రెండు , మూడు రోజులుగా తనపై వస్తున్న పెళ్లి వార్తల ఫై హీరో రామ్ క్లారిటీ ఇచ్చాడు. పెళ్లి వార్తల్లో…

10 hours ago

ఓటిటి ప్రేక్షకులకు షాక్ ఇచ్చిన నిర్మాతలు

కరోనా కారణంగా కొన్ని నెలల పాటు థియేటర్స్ మూతపడడంతో సినీ లవర్స్ ఓటిటికి అలవాటు పడ్డారు. ప్రస్తుతం థియేటర్స్ ఓపెన్…

11 hours ago