ఉక్రెయిన్‌ ప్రధాని రాజీనామా తిరస్కణ

Oleksiy Honcharuk
Oleksiy Honcharuk

కీవ్‌: ఉక్రెయిన్‌ ప్రధాని ఓలెక్సి గోంచారుక్‌ రాజీనామాను అధ్యక్షుడు వ్లదిమిర్‌ జెలెన్‌స్కీ శనివారం తిరస్కరించారు. ఆయనను ప్రధానిగా కొనసాగాలని కోరారు. అధ్యక్షుడు జెలెన్‌స్కీకి ఆర్థిక వ్యవస్థపై అంతగా అవగాహన లేదని చేసిన విమర్శలకు సంబంధించిన ఒక ఆడియో లీక్‌ అయిన నేపథ్యంలో గోంచూరక్‌ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జెలెన్‌స్కీ కార్యాలయం శనివారం విడుదల చేసిన వీడియోలో ఇది విచారకర పరిస్థితి అని పేర్కొంది. ఓలెక్సి గోంచారుక్‌ను, ఆయన మంత్రి వర్గాన్ని కొనసాగవలసిందిగా కోరారు. ”ప్రజలు ఆందోళన చెందుతున్న ముఖ్యమైన సమస్యలను మీరు పరిష్కరించ గలిగితే మీకు, మీ ప్రభుత్వానికి ఒక ఛాన్స్‌ ఇవ్వాలని నిర్ణయించు కున్నాను” అని జెలెన్‌స్కీ అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/