రష్యా ఆయుధాగారంపై ఉక్రెయిన్‌ బలగాలు దాడి..

Ukraine Blows Up Russian Ammunitions Depot Near Border: Governor

కివ్‌ః ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తమ రాజధాని కీవ్‌పై పుతిన్‌ సేనలు బాంబులతో విరుచుకు పడిన నాలుగు రోజుల తర్వాత ఆ దేశానికి చెందిన ఆయుధాగారంపై ఉక్రెయిన్‌ బలగాలు దాడులు చేశాయి. దీంతో భారీ పేలుళ్లతో ఆయుధాగారం ధ్వంసమైపోయింది. రష్యా సరిహద్దుల్లోని బెల్‌గరోడ్‌ రీజియన్‌లో ఉన్న ఓ గ్రామంలో ఉన్న ఆయుధ డిపోపై ఉక్రెయిన్‌ సైన్యం క్షిపణులతో దాడికి పాల్పడిందని గవర్నర్‌ వ్యచెస్లేవ్‌ గ్లాడ్‌కోవ్‌ తెలిపారు.

దీంతో ఆ ప్రాంతంలో భారీ శబ్ధంతో కూడిన మంటలు ఎగసిపడ్డాయని, ఆయుధ డిపో ధ్వంసమైందని చెప్పారు. బెల్‌గరోడ్‌లోని నివాస సముదాయాలపై కూడా ఉక్రెయిన్‌ బలగాలు బాంబులు విసిరాయని తెలిపారు. అయితే ఈ ఆరోపణలను ఉక్రెయిన్‌ సైన్యం తోసిపుచ్చింది. కాగా, నాలుగు నెలల విరామం తర్వాత ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై రష్యా బాంబుల వర్షం కురిపించింది. బాంబుల మోతతో కీవ్‌లోని షెవ్చెంకో ప్రాంతం దద్దరిల్లింది. ఈ దాడుల్లో ఎనిమిది మంది మృతిచెందగా, 24 మంది గాయపడ్డారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/