అందువల్లే కరోనా తీవ్రత అధికంగా ఉంది

దేశవాసులను హెచ్చరించిన యూకే పీఎం బోరిస్ జాన్సన్

Johnson named his son with doctors name
boris johnson

బ్రిటన్‌: ఊబకాయం కారణంగానే బ్రిటన్ వాసుల్లో కరోనా మహమ్మారి మరింతగా విజృంభించిందని, ప్రజలంతా ఒబేసిటీని తగ్గించుకునే ప్రయత్నాలు చేయాలని, అప్పుడు మరింత సమర్థవంతంగా కరోనాపై పోరాడవచ్చని యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ వ్యాఖ్యానించారు. తనకు కరోనా సోకిందన్న విషయాన్ని గుర్తు చేసిన ఆయన, తాను ఊబకాయాన్ని తగ్గించుకోవడంతోనే వైరస్ బారి నుంచి బయటపడగలిగానని అన్నారు. జాతిని ఉద్దేశించి తాజాగా ప్రసంగించిన ఆయన, ప్రజలంతా వ్యాయామాలు చేయడం ద్వారా లావు తగ్గాలని సూచించారు. వైరస్ గణాంకాలు తనకు ఆందోళన కలిగిస్తున్నాయని, ఇతర యూరప్ దేశాలతో పోలిస్తే, బ్రిటన్ వాసులు అధిక ఊబకాయంతో బాధపడుతూ ఉన్నారని గుర్తు చేసిన ఆయన, శరీరం ఫిట్ గా ఉంటే, కొవిడ్ వంటి వైరస్ లతో మరింత బలంగా పోరాడవచ్చని జాన్సన్ వ్యాఖ్యానించారు. ఆ పరిస్థితి వస్తే, దేశం ఆనందంగా ఉంటుందని, దేశ ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం శ్రద్ధ చూపుతుందని అన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/