అనిల్‌ అంబానీ 700 కోట్లు చెల్లించాల్సిందే

అనిల్‌ అంబానీ నికరవిలువు సున్నాగా ఉంది

anil ambani
anil ambani

లండన్‌: ఇండస్ట్రియల్‌ అండ్‌ కమర్షియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా (ముంబయి శాఖ), చైనా డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌, ఎగ్జిమ్‌బ్యాంక్‌ ఆఫ్‌ చైనాలు రిలయన్స్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీపై దావా వేశాయి. దీంతో విచారణ చేపట్టిన కోర్టు అనిల్‌ అంబానీ 3 చైనా బ్యాంకులకు 6 వారాల్లోగా 100 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.700 కోట్లు) చెల్లించాల్సిందేనని బ్రిటన్‌కోర్టు తీర్పు నిచ్చింది. రుణ ఒప్పందం కింద అనిల్‌ అంబానీ నుంచి 680 మిలియన్‌ డాలర్లు (సమారు రూ.4800 కోట్లు) రికవరీ చేయాలని కోరుతూ చైనా బ్యాంకులు వేసిన దావాను విచారించిన కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. అంబానీ నికరవిలువ సున్నాగా మారిందన్న ఆయన తరపు న్యాయవాదుల వాదనను కోర్టు అంగీకరించలేదు. ఆయన కుటుంబం కూడా ఆదుకునే పరిస్థతి లేదనడాన్ని న్యాయమూర్తి డేవిడ్‌ వాక్స్‌మన్‌ తిరస్కరించారు. ఈ తీర్పును పై కోర్టులో సవాలు చేస్తామని రిలయన్స్‌ గ్రూప్‌ తెలిపింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/