ఆరంభమే 60 శాతం పెరిగిన ఉజ్జీవన్

ఇటీవల ఐపీఓకు వచ్చిన ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

Ujjivan Small Finance Bank
Ujjivan Small Finance Bank

ముంబయి: ఇటీవల ఐపీఓకు వచ్చి రూ. 750 కోట్లను సమీకరించిన ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఈరోజు తొలిసారిగా లిస్టింగ్ అయింది. ఆరంభం రోజునే నమ్ముకున్న ఇన్వెస్టర్లకు 60 శాతం ప్రీమియంను అందించింది. ఒక్కో ఈక్విటీ వాటాను రూ. 36 నుంచి రూ. 37 మధ్య అమ్మకానికి ఉంచగా, 166 రెట్లు ఓవర్ సబ్ స్క్రయిబ్ అయిన ఉజ్జీవన్ ఇష్యూ, కనీసం 50 శాతం ప్రీమియంను ఇస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. అయితే, అంచనాలను మించి ఈక్విటీకి డిమాండ్ కనిపించింది. ఈ ఉదయం స్టాక్ మార్కెట్ ప్రారంభం కాగానే, ఉజ్జీవన్ స్మాల్ బ్యాంక్ ఈక్విటీ రూ. 62కు చేరింది. దీంతో సంస్థ పేరెంటే కంపెనీ ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మార్కెట్ కాప్ రూ. 4,300 కోట్లకు పైగా పెరగడం గమనార్హం.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/