ఉగాది పచ్చడి

పండుగలు విశేషాలు

ఉగాది పచ్చడి
Ugadi pachadi

ఉగాది రోజున పచ్చడికి విశేష ప్రాధాన్యత ఉంది. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు కలసిన షడ్రుచుల సమ్మేళనంతో దీన్ని తయారు చేస్తారు.

ఉగాది పచ్చడి తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు కలసిన షడ్రుచుల సమ్మేళనం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని పచ్చడి ఇస్తుంది.

ఈ పచ్చడి కొరకు చెరకు రసం, అరటిపళ్లు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు జామకాయలు, బెల్లం మొదలైనవి వాడుతారు.

ఉగాది పచ్చడి తయారీ విధానం :

అవసరమైన పదార్థాలు
మామిడికాయ ( ఓ మాదిరి పరిమాణం కలది)-1
వేప పువ్వు – 1/2 కప్పు
సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు – అరకప్పు
కొత్త చింతపండు – 100 గ్రాములు
కొత్త బెల్లం – 100 గ్రాములు
మిరపకాయలు – 2
అరటిపండు -1
చెరకు రసం – అరకప్పు
ఉప్పు – సరిపడినంత
నీళ్లు అవసరమైతే అరటిపళ్లు, జామకాయలను కూడా వేసుకోవచ్చు.

తయారు చేసే విధానం : ముందుగా వేపపువ్వును కాడల నుంచి వేరు చేసి పెట్టుకోవాలి. చింతపండులో కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టి పది నిమిషాల తరువాత దాని గుజ్జును వేరుచేయాలి. మామిడికాయను, మిరపకాయలు, కొబ్బరిని సన్నగా తరగాలి. తర్వాత చెరకు రసం సిద్ధం చేసి, మిగతా పళ్లను వాటిని కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి.

బెల్లాన్ని కూడా తురిమి పెట్టుకుని దాన్ని చింతపండు గుజ్జులో కలపాలి. ఈ మిశ్రమంలో మామిడికాయ ముక్కలు, తరిగిన కొబ్బరి, మిరపకాయ ముక్కలను వేసి చివరిగా ఒక అర స్పూన్‌ ఉప్పు వేసి కలుపుకోవాలి.

అంతే షడ్రుచుల ఉగాది పచ్చడి సిద్ధమైపోయినట్లే, ఒక వసంత లక్ష్మిని ఆహ్వానించి, నైవేద్యంగా సమర్పించి తర్వాత స్వీకరించాలి. అంతేకాదు మిగతా వాళ్లకు అందజేయండి. కష్టసుఖాలను జీవితంలో చవిచూడాలనే నిజాన్ని ఉగాది పచ్చడి సేవనం తెలియజేస్తుంది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/