తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం

తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం
‘Panchanga Shravanam’

హైదరాబాద్‌: ఈరోజు వికారి నామ సంవత్సర ఉగాది సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రవీంద్రభారతితో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ సిద్ధాంతి పంచాంగ శ్రవణం చేశారు. వికారి నామ సంవత్సరం అయినప్పటికీ వికాసం బాగానే ఉంటుందని.. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని తెలిపారు. రాష్ట్రం ఆర్థికంగా ఎదుగుతుందని, కాళేశ్వరం సహా ప్రాజెక్టులన్నీ త్వరగా పూర్తవుతాయని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ , సీఎస్ జోషిది ఒకే రాశి అని, రాష్ట్రానికి మరింత మేలు జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషితో పాటు ఉన్నతాధికారులు వేడుకల్లో పాల్గొన్నారు.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/