గాంధీభవన్‌లో పంచాంగ శ్రవణం

panchagam Kartha
panchagam Kartha

హైదరాబాద్‌: గాంధీభవన్‌లో ఈరోజు ఉగాది ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పండితులు శ్రీనివాసమూర్తి పంచాంగ శ్రవణం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ అస్థిరత నెలకొనే అవకాశాలు ఉన్నాయని పండితులు శ్రీనివాసమూర్తి అన్నారు.కేంద్ర, రాష్ట్ర రాజీకీయ స్థితిగతులపై కూడా ఆయన జోస్యం చెప్పారు. ఈ శ్రీ వికారినామ సంవత్సరంలో వర్షాలు తక్కువ పడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఏఐసీసీ కిసాన్‌ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డితదితరులు హాజరయ్యారు.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/