రేపు రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలు

Ugadi , Celebrations
Ugadi , Celebrations

హైదరాబాద్‌: రాజ్‌భవన్‌లో శుక్రవారం (రేపు) ఉగాది వేడుకలు జరగనున్నాయి. ఉగాది వేడుకల్లో గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు పాల్గొననున్నారు. ఈ వేడుకల్లో భాగంగా పంచాంగ శ్రవణంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 6న ఉదయం 10:30 గంటలకు రవీంద్రభారతిలో ఉగాది వేడుకలు జరగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే వికారి నామ సంవత్సర ఉగాది వేడుకల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి పాల్గొననున్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందుకు ప్రగతి భవన్‌ జనహితలో కాకుండా రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఉగాది వేడుకలను నిర్వహిస్తోంది.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/