ఆంధ్ర బ్యాంక్‌ విలీనంపై యూనియన్‌ బ్యాంక్‌ బోర్టు ఆమోదం

andhra bank
andhra bank

న్యూఢిల్లీ: ఆంధ్ర బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌ను విలీనం చేయడానికి యూనియన్ బ్యాంక్ బోర్డు ఆమోదం తెలిపింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యుబిఐ) డైరెక్టర్ల బోర్డు సోమవారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.17,200 కోట్లు సేకరించడానికి బ్యాంకు బోర్డు ఆమోదం తెలిపింది. సోమవారం జరిగిన డైరెక్టర్ల బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్టాక్ మార్కెట్‌కు పంపిన కమ్యూనికేషన్‌లో బ్యాంక్ తెలిపింది. పరిశీలన తర్వాత ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌ను యూనియన్ బ్యాంకులో విలీనం చేయడానికి డైరెక్టర్ల బోర్డు సూత్రప్రాయంగా అనుమతి ఇచ్చిందని బ్యాంక్ తెలిపింది. ఇవే కాకుండా 201920లో బ్యాంకులో రూ.17,200 కోట్ల మూలధన పెట్టుబడి సవరణ పథకానికి కూడా డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. ఇందులో 13,000 కోట్ల రూపాయలను ఈక్విటీ క్యాపిటల్ ద్వారా, రూ.4,200 కోట్లు టైర్2 బాండ్ల ద్వారా సేకరిస్తామని బ్యాంక్ తెలిపింది. ప్రిఫరెన్షియల్ కేటాయింపుల ద్వారా ఈక్విటీ షేర్లను జారీ చేయడం ద్వారా 13,000 కోట్ల రూపాయల మూలధనాన్ని సేకరించడానికి బోర్డు ఆమోదించినట్లు బ్యాంక్ తెలిపింది. దీని కోసం ఇతర రెగ్యులేటరీ ఆమోదాలు పొందాల్సి ఉంది. ఆగస్టు 30న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 10 ప్రభుత్వరంగ బ్యాంకుల అనుసంధానంతో నాలుగు అతిపెద్ద బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/