10 బిలియన్‌ డాలర్ల ఉబెర్‌ వాటాలు విక్రయం

uber
uber

వాషింగ్టన్‌: క్యాబ్‌ సర్వీసులలో దిగ్గజం ఐన ఉబెర్‌ ఐపిఓకు సిద్ధమైంది. మొత్తం 10 బిలియన్‌ డాలర్ల విలువైన వాటాలను ఇది విక్రయించనుంది. ఐపిఓ సైజును బట్టి 2014 తర్వాత ఒక టెక్నాలజీ సంస్థ తీసుకొస్తున్న పెద్ద ఐపిఓగా నిలిచిపోనుంది. తొలుత ఉబెర్‌ విలువను 120 బిలియన్‌ డాలర్లుగా భావించారు. కానీ ఇటీవల క్యాబ్‌ సేవల సంస్థ ఎల్‌వైఎఫ్‌టి ఐపిఓకు వచ్చి పెట్టుబడిదారులను ఆకర్షించలేకపోయింది. దీంతో ఉబెర్‌ విలువను 90-100 బిలియన్‌ డాలర్లకు కుదించారు. ఆ తర్వాత ఉబెర్‌ విలువను 76 బిలియన్‌ డాలర్లుగా లెక్కించారు.
అమెరికా సెక్యూరిటీ అండ్‌ ఎక్స్‌ఛేంజి కమీషన్‌ వద్ద ఉబెర్‌ గురువారం ఐపిఓకు రిజిస్టర్‌ చేసుకోనుంది. ఏప్రిల్‌ చివర్లో రోడ్‌ షో నిర్వహిస్తుంది. మే మొదటి వారంలో న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్‌చేంజిలో నమోదు కావచ్చని భావిస్తున్నారు.

తాజా హీరోయిన్‌ల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actress/