ఇండియాలో ఉబెర్‌ భారీ పెట్టుబడులు

Uber
Uber

బెంగుళూర్‌: ఆన్‌లైన్‌ క్యాబ్‌ బుకింగ్స్‌ యాప్‌సంస్థ ఉబెర్‌, భారత్‌లో తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తోంది. ఇందుకోసం భారత్‌లో తన అనుబంధ సంస్థ ఉబెర్‌ ఇండియా సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఈక్విటీలో కొత్తగా రూ.. 1,767 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఈ పెట్టుబడుల్లో ఎక్కువ భాగాన్ని ఉబెర్‌ ఈట్స్‌ విస్తరణ కోసం ఉపయోగించాలని ఉబెర్‌ భావిస్తున్నట్లు సమాచారం. ఇంకా హైదరాబాద్‌, బెంగుళూర్‌లొని పరిశోధన, అభివృద్ది (ఆర్‌ అండ్‌ డి) కేంద్రాల్లో ప్రస్తుతం ఉన్న 500ల మంది ఉద్యోగుల్ని రెట్టింపు చేయాలని యోచిస్తుంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/