త్వరలో రానున్న ఉబర్‌ బస్సులు

యాప్‌ విడుదల.. ప్రయోగాత్మకంగా ఢిల్లీలో అమలు

uber-bus
uber-bus

న్యూఢిల్లీ: ఇప్పటి వరకు మోటార్‌ సైకిళ్లు, ఆటోలు, కార్ల ద్వారా క్యాబ్‌ సర్వీసులను అందిస్తున్న ఉబర్‌ ఇపుడు బస్సులను కూడా ప్రవేశపెట్టబోతోంది. ఇందుకు సంబంధించిన ఓ యాప్‌ను మంగళవారంనాడిక్కడ విడుదల చేసింది. ప్రయోగాత్మకంగా దీనిని ఢిల్లీలో కొన్ని ఎంపిక చేసిన ప్రధాన రూట్లలో నడుపుతారు. ఒకవేళ విజయవంతమైతే అన్ని చోట్లకూ, అన్ని ప్రధాన నగరాలకూ విస్తరిస్తామని ఉబర్‌ సీఈవో దారా ఖోస్రో్‌సషాహీ తెలిపారు. ఓ రకంగా ఇది ప్రస్తుతం క్యాబ్‌ల తరహాలోనే నడుస్తుంది. యాప్‌లో వినియోగదారులు తమ పికప్‌, డ్రాపింగ్‌ పాయింట్లను లోడ్‌ చేయవచ్చు.

నిర్ణీత ప్రదేశంలో మాత్రమే ఎక్కాలి తప్ప ఇంటి వరకూరాదు. కేవలం రెండు నుంచి ఐదు నిమిషాల సేపు మాత్రమే ఆగుతుంది. వెయిటింగ్‌ ఉండదు. అదే విధంగా మన గమ్యస్థానానికి అతి సమీపాన విడిచిపెడతారు. బస్సులన్నీ ఏసీయే! సీట్లు రిజర్వ్‌ చేయబడతాయి. మధ్య మధ్యలో ఆపి యాప్‌ ద్వారా బుకింగ్‌ చేసుకోని వారిని ఎక్కించుకోవడం ఉండదు. బస్సు ఎక్కగానే బార్‌కోడ్‌ను స్కాన్‌ చేసి టికెట్‌ను చూపి నగదు ద్వారా గానీ లేదా పేటీఎం లాంటి ద్వారా గానీ ధర చెల్లించవచ్చు. బస్సు ట్రాకింగ్‌ చేసుకోవచ్చు. మనం దిగే పాయింట్‌ చేరువైనపుడు యూబర్‌ నుంచి అలర్ట్స్‌ వస్తాయి. మన గమ్యస్థానానికి వెళ్లేందుకు నోటిఫికేషన్లూ వస్తాయి.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/