యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ కన్నుమూత

దుబాయ్‌: యూఏఈ అధ్యక్షుడు షేక్‌ ఖలీఫా బిన్‌ జయేద్‌ అల్‌ నహ్యాన్‌(73) శుక్రవారం కన్నుమూశారు. ఈ మేరకు అబుదాబి ప్రిన్స్‌ మహ్మద్‌ బిన్‌ జాయేద్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 1948లో జన్మించిన షేక్‌ ఖలీఫా.. 2004లో యూఏఈ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. తనదైన పాలనతో దుబాయ్‌ను మరో ఎత్తుకు తీసుకెళ్లారు.

2014లో గుండెపోటుకు గురైనప్పటి నుంచి ఆయన బయటి ప్రపంచానికి ఎక్కువగా కనిపించటం లేదు. తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకొనేవరకు ప్రస్తుత ఉపాధ్యక్షుడు, ప్రధాని షేక్‌ మహ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌ అధ్యక్షుడిగా కొనసాగుతారు. అధ్యక్షుడి మృతి నేపథ్యంలో యూఏఈ ప్రభుత్వం 40 రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/