భారత్ సహా 14 దేశాల పై యూఏఈ బ్యాన్!

జులై 21 వరకు 14 దేశాల ప్రయాణికులపై నిషేధం

అబుధాబి: ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశమైన యూఏఈ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ సహా 14 దేశాలకు తమ దేశ పౌరులు ప్రయాణించకుండా బ్యాన్ విధించినట్లు గురువారం గల్ఫ్ దేశం యూఏఈ ప్రకటించింది. యూఏఈ ప్రయాణాలు నిషేధించిన దేశాల జాబితాలో భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, నేపాల్, శ్రీలంక, వియత్నాం, నమిబీయా, జాంబియా, కాంగో, ఉగాండా, సీర్రా లియోన్, లైబీరియా, దక్షిణాఫ్రికా, నైజీరియా ఉన్నాయి. ప్రస్తుత సీజన్‌లో దేశ పౌరులు ఇతర దేశాలకు ప్రయాణించేటప్పుడు తప్పకుండా కరోనా నిబంధనలు పాటించాలని ఈ సందర్భంగా యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ మరియు జాతీయ అత్యవసర, సంక్షోభ, విపత్తు నిర్వహణ అథారిటీ వెల్లడించింది.

అయితే ఛార్టర్డ్, కార్గో విమానాలకు ఈ నిషేధం వర్తించదని తెలిపింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/