బిజెపిలో చేరికపై కోమటిరెడ్డి యూటర్న్!

హైదరాబాద్: కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ను వీడి బిజెపి తీర్ధం పుచ్చుకుంటారని గత కొన్ని రోజులుగా వార్తలు గుప్పుమంటున్నాయి. ఐతే దీనిపై ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్లరని..వెళితే రాజగోపాల్ రెడ్డి మాత్రమేనని, త్వరలోనే ఈ చేరిక ఉంటుందని కూడా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఏమైందో తెలియదు కాని కోమటిరెడ్డి యూటర్న్ తీసుకున్నారు. తనను బిజెపి ఆహ్వానించలేదని, తాను కూడా కాషాయ కండువా కప్పుకోవట్లేదని చివరిగా తేల్చేశారు.
నాయకత్వ లోపం వల్లే ఎమ్మెల్యేలు పార్టీ మారారని, పార్టీ బలంగా ఉన్నా నాయకత్వ లోపం వల్ల కార్యకర్తలు రోడ్డున పడ్డారు అని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. ప్రస్తుతం తాను కాంగ్రెస్ సభ్యుడినే నని ఆయన చెప్పుకొచ్చారు.
తాజా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/latest-news/