ఎనీమియాలో రకాలు

Types in anemia

రక్తహీనతేగా! నాలుగు ఐరన్‌ ట్యాబ్లెట్లు వేసుకుంటే చాలు అదే చక్కబడుతుంది అనేవాళ్లే ఎక్కువ. కానీ పోషకలోపాలకు మించి రక్తలేమికి దారి తీసే పలు ఇతర కారణాలెన్నో ఉన్నాయి. వాటికి అవసరమైన చికిత్సలేమీ తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఉండిపోతే, అది పలు రుగ్మతలకు దారి తీసే ప్రమాదం ఉంది. నీరసం నిస్సత్తువతో మొదలై, శ్వాసపరమైన సమస్యలు, మెదడు పనితనం తగ్గి పోవడం, గుండె జబ్బుల వంటి సమ స్యలు తలెత్తే అవకాశం ఉంది.

ఒక్కో సారి కేన్సర్‌కు సూచన కూడా కావచ్చు. వృద్ధులందరిలోనూ కనిపించే రక్తహీన తకు వార్ధక్యం ఒక్కటే కారణం కాదు. నిజానికి రక్తహీనతకు కారణాలు అనేకం. శరీరంలో ఎర్ర రక్తకణాలు తగ్గిపోవడాన్నే అనీమియా అంటాం. ఎర్ర రక్తకణాల్లో హీమోగ్లోబిన్‌ ఉంటుంది. ఈ హీమో గ్లోబినే శరీరానికికంతటికీ ఆక్సిజన్‌ను చేరవేస్తుంది. శరీరంలో ఎర్ర రక్తకణాలు తగ్గిపోయినప్పుడు అవసరమైనంత ఆక్సీజన్‌ అందదు.

అనీమియాకు జన్యు కారణాలు ఉన్నప్పటికీ, అత్యధికం ఇతర కారణాలతో సంక్రమించేవే. ఎక్కువ మందిలో కనిపించే అనీమియా ఈ రకమే. అవసరమైన ఐరన్‌ అందనప్పుడు శరీరంలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తి తగ్గిపోతుంది. జీర్ణాశయంలో రక్తస్రావం కావడం, పేగుల్లోవాపు ఏర్పడటం, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌, కిడ్నీలు దెబ్బ తినడం వంటివి కూడా అనీమియాకు దారి తీయవచ్చు. ఇది ఆటోఇమ్యూన్‌ వ్యాధి కారణంగా వచ్చే సమస్య.

ఈ వ్యాధి వల్ల శరీరంలో బి-12 విటమిన్‌ తగ్గిపోతుంది. బి-12 విటమిన్‌ ట్యాబ్లెట్లు వేసుకోవడం ద్వారా ఈ సమస్య తగ్గిపోతుంది. శరీరంలో బి-12 తగ్గడం వల్ల మధుమేహం, గ్రేవ్స్‌ డిసీజ్‌, విటిలిగో వంటి చర్మవ్యాధులు, సిలియక్‌ వ్యాధి, క్రోన్స్‌ వ్యాధి వంటి సమస్యలు తలెత్తుతాయి. ఎముక మజ్జ దెబ్బతినడం వల్ల అనీమియా సమస్య తలెత్తుతుంది.

రుమటాయిడ ఆర్థరైటిస్‌, లూపస్‌ వంటి ఆటో ఇమ్యూన్‌ వ్యాధుల వల్ల గానీ, కొన్ని రకాల ఇన్‌ఫెక్షన్ల వల్ల గానీ, కొందరిలో ఎముక మజ్జ దెబ్బ తింటుంది. ఎముక మజ్జ ఉత్పత్తి చేసే రక్తకణాల కన్నా ఎక్కువగా రక్తకణాలు నశించిపోవటం వల్ల తలెత్తే సమస్య ఇది. కొన్ని రకాల కేన్సర్ల వల్ల తరచూ వాడే కొన్ని రకాల మందుల వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. సమస్య కారణం ఆధారంగా ఎనీమియా వైద్యం ఉంటుంది. ఐరన్‌ లోపమైతే దాన్ని పూరించడం, ఇతర జబ్బులే కారణమైతే వాటిని నయం చేయడం ఇందులో భాగమవ్ఞతాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/