అమెరికాలో మళ్ళీ కాల్పుల మోత

వాషింగ్టన్‌: అమెరాకలోని మెమ్‌ఫిస్‌లోని టెన్నెస్సీ పోస్టాఫీస్‌లో ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో యూఎస్‌ పోస్టల్‌ సర్వీస్‌ ఉద్యోగులు ఇద్దరు చనిపోయారు. అయితే కాల్పులకు పాల్పడిన వ్యక్తి కూడా పోస్టల్‌ ఉద్యోగే అని పోస్టల్‌ ఇన్‌స్పెక్టర్‌ సుసాన్‌ తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతనికోసం పోలీసులు గాలిస్తున్నారని వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని చెప్పారు.

అమెరికాలో కాల్పులకు పాల్పడటం సర్వ సాధారణమైపోయింది. దేశంలో ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతంలో దుండగులు తుపాకీతో విరుచుకుపడుతూనే ఉంటారు. ప్రజలు విచ్చలవిడిగా తుపాకుల ఉపయోగించకుండా కఠినమైన చట్టాలు తీసుకురావాలని సామాజిక వేత్తలు కోరుతున్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/