ఏపిని తాకిన పౌరసత్వ బిల్లు సెగ

Visakhapatnam Railway Station
Visakhapatnam Railway Station

విశాఖ: కేంద్రం నూతనంగా ప్రవేశ పెట్టిన పౌరసత్వ సవరణ బిల్లు సెగలు తాజాగా ఏపిని తాకాయి. ఈ నూతన చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈశాన్య రాష్ట్రాలు, బెంగాల్‌లో చెలరేగుతన్న అల్లర్ల కారణంగా ఉత్తరాది నుంచి రాష్ట్రానికి రావాల్సిన రైళ్లు పూర్తిగా రద్దయ్యాయి. అంతేకాకుండా ఇక్కడినుంచి వెళ్లాల్సిన రైళ్లను కూడా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కారణంగా విశాఖ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఫలకునూమా, కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లను నిలిపివేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. దీంతో ముందుగా టికెట్లను తీసుకున్న ప్రయాణికులు తమను గమ్యస్థానాలకు చేర్చాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/