70 శాతం మందికి కరోనా సోకే ప్రమాదం ఉంది

మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఎంత చేయాలో అంతా చేస్తాం..ఏంజెలా మెర్కెల్

angela-merkel
angela-merkel

జర్మనీ: కరోనా మహమ్మారితో జర్మనీ అల్లాడిపోతుంది. ఈనేపథ్యంలో జర్మనీ దేశాధ్యక్షురాలు ఏంజెలా మెర్కెలా మాట్లాడుతూ.. జర్మనీలో మొత్తం జనాభాలో 70 శాతం మందికి ఈ వైరస్ సోకే ప్రమాదం ఉందని ఆమె చెప్పారు. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఎంత చేయాలో అంతా చేస్తామని తెలిపారు. ఆ తర్వాతే ఎంత బడ్జెట్ ఖర్చయిందనే విషయం గురించి ఆలోచిస్తామని చెప్పారు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రమాదం తీవ్రంగానే ఉందని ఏంజెలా మెర్కెల్ తెలిపారు. కరోనా వైరస్ ప్రభావం ఇలాగే కొనసాగితే… ప్రజల్లో రోగ నిరోధక శక్తి లేకపోతే… కరోనాకు వాక్సిన్, చికిత్సను కనుక్కోకపోతే… దేశ జనాభాలో 60 శాతం నుంచి 70 శాతం వరకు ప్రజలు దీని బారిన పడతారని చెప్పారు. ప్రజలంతా పరిశుభ్రంగా ఉండాలని మెర్కెల్ పిలుపునిచ్చారు. షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవద్దని, కేవలం కళ్ల ద్వారా మాత్రమే పలకరించుకోవాలని చెప్పారు. యూరప్ దేశాలన్నింటితో కలసి కరోనాను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తామని తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/