జమ్ముకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదల హతం

terrorists killed in encounter in Jammu and Kashmir
terrorists killed in encounter

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో ఇద్దరుఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుపెట్టాయి. ఉత్తర కశ్మీర్‌లోని నౌగామ్‌ సెక్టార్‌లో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు కాల్చి చంపాయి. కుప్వారా జిల్లా బారాముల్లా సమీపంలని నౌగామ్‌ సెక్టార్‌లోని ఎల్‌ఓసీ వద్ద శనివారం తెల్లవారు జామున ఇద్దరు అనుమానాస్పద వ్యక్తుల కదలికలను భద్రతా దళాలు గుర్తించాయని ఆర్మీ పీఆర్‌ఓ ప్రకటించారు. దీంతో వారిపై కాల్పులు జరిపాయని, అందులో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారని తెలిపారు. వారివద్ద రెండు ఏకే 47 తుపాకులు, ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/