ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

terrorists killed in encounter in Jammu and Kashmir
terrorists killed in encounter

జమ్మూకశ్మీర్‌: షోపియన్‌లోని సుగన్ జైనాపొర ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఈరోజు ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఇంకా ఆపరేషన్‌ కొనసాగుతోంది. ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, గత కొద్దిరోజులుగా జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఎరివేత కొనసాగుతోంది. ఆర్మీ, జమ్మూకశ్మీర్‌ పోలీసుల బృందం సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తోంది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/