మేడారం జాతరలో బాధాకర ఘటన

జంపన్న వాగులో ఇద్దరు మృతి

Jampanna Vagu
Jampanna Vagu

మేడారం: తెలంగాణ కు కుంభమేళా గా పిలవబడే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో అపశ్రుతి చోటు చేసుకుంది. జంపన్న వాగులో స్నానం చేస్తుండగా ఇద్దరు మృతి చెందిన ఘటన మేడారం జాతరలో జరిగింది. వివరాల్లోకెళితే… ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల జాతరకు భక్తులు తండోపతండాలు తరలి వస్తున్నారు. అయితే మేడారం ఆచారం ప్రకారం ముందు జంపన్న వాగులో స్నానమాచరించి తరువాత అమ్మవార్ల దర్శనానికి భక్తులు వెళ్తుంటారు. అదే విధంగా వీళ్లిద్దరు కూడా జంపన్న వాగులో స్నానం చేస్తుండగా మూర్ఛ వచ్చి చనిపోయారు. మరణించిన వారిని సికింద్రాబాద్‌కు చెందిన వినయ్, దుమ్ముగూడెం మండలం సుబ్బారావుపేటకు చెందిన వినోద్‌గా పోలీసులు గుర్తించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/